Friday, March 9, 2018

నోరు పొక్కితే - ఈ చిన్ని చిట్కా చేస్తే వెంటనే తగ్గుతుంది -- home remedy to reduce red small bumps in mouth

Apply Amla Juice with cotton on affected area twice a day. Soon you can see the recovery.

- Tip from Sumalatha.



Dosa


Telugu Padhyalu


చదివే సమయంలో పెదవి మాత్రమే తగిలే పద్యం-

భూమీ భామాంబు భవా
వామాపా వైభవ భువి భావావాపా
వేమమ్మోముము భూభవ
భీమ భవాభావ భావ విభువామావిభా


*చదివే సమయంలో పెదవులు తగలనిది*

శ్రీశా సతత యశః కవి
తాశా ధాత్రీశ ఖండితాశా నిస్సం
కాశా నిరతారాధిత
కీశేశా హృష్ణ గగనకేశా యీశా

ఒక అక్షరం పెదవికి తగలనిది * *తరువాతి అక్షరం తగిలేది
అంటే పెదవి తగలనిది,తగిలేది

దేవా శ్రీమాధవ శివ
దా వేగాభిజ్ఞ మురభిదా మాధామా
జ్యావగ వంద్యా వాసవ
సేవితపద పగవిరామ శివ జపనామా

కేవలం నాలుక కదిలేది

సారసనేత్రా శ్రీధర
రారా నన్నేల నిందు రాక్షసనాశా
నారద సన్నుత చరణా
సారతరానందచిత్త సజ్జనరక్షా

నాలుక కదలని(తగలని) పద్యాలు

కాయముగేహము  వమ్మగు
మాయకు మోహింపబోకు మక్కువగ మహో
పాయం బూహింపుము వే
బాయగ పాపంబు మంకుభావమవేగా

భోగిపభుగ్వాహ మహా
భాగా విభవైకభోగ బావుకభావా
మేఘోపమాంగభూపా
బాగుగమముగావువేగ బాపాభావా

నాలుక కదిలీ కదలని పద్యం

ఓ తాపస పరిపాలా
పాతక సంహారా వీర భాసాహేశా
భూతపతిమిత్ర హరి ముర
ఘాతా కాలాంబుదవిధ గాత్రవరాహ్వా


Source: WhatsApp message from Shamanth Garu