గర్భిణీ స్త్రీ ఆరవనెల పొడుగునా రోజుకి ఓ ముద్ద చొప్పున హరిద్రా (పసుపుతో కూడిన) అన్నాన్ని (అన్నమైన పులిహోర) తినాలి. పులిహోర అనగానే తెలుసు అనుకోకూడదు.
మరీచీ రజనీ చూర్ణః జీరకాద్యైశ్చ సంయుతం!ఆద్యేవ సంప్లూతం దేవీం హరిద్రాన్నమితీరితమ్!!
మిరియాల పొడి, కొద్దిగా కుంకుమ పూపొడి జీలకర్రతో కలిపిన పసుపు అన్నం ఏదుందో దాన్ని హరిద్రాన్నమంది శాస్త్రం. అయితే దీనిలో ఆవునేతికి బదులుగా నూపప్పు నూనేని వాడచ్చు. కొద్ది వెనుక కాలంలో అన్నంలో పప్పునూనెని వాడుతూండేవారు కూడా (చేతిమీదికి - అని దానిని వ్యవహరిస్తూండే వారు). ఈనెల పొడుగునా ఎక్కువ పర్యాయాలు మననం చేసుకోవలసిన నామాలు -
ఆజ్ఞా చక్రాబ్జ నిలయా శుక్లవర్ణా షడాననా!
మజ్జాసంస్థాహంసవతీ ముఖ్య శక్తి సమన్వితా!
హరిద్రాన్నైక రసికా హాకినీ రూపధారిణీ!!
ఈ ఆరవ నెలలో - శ్రోత్రాణి భవంతి - అని ఉపనిషత్తు చెప్తోంది. కాబట్టి గర్భస్థ శిశువుకి ముక్కు, కళ్ళు, చెవులు ఏర్పడతాయి. ఈ అవయవాల్లో దోషం రాకుండా ఉండేందుకు పైన నామాలని వీలైనన్ని ఎక్కువ మార్లు చదువుకుంటూ ఉండాలి. ఆరవనెల శిశువుని రక్షించే దేవత పేరు 'హాకినీదేవి'.
Source:
https://www.facebook.com/BrahmasriChagantiKoteswaraRao/photos/a.256156637767075.53293.176629199053153/744727768909957/?type=1&theater
No comments:
Post a Comment