Wednesday, February 18, 2015

8th and 9th Month Pregnancy - Have to read Lalitha Sahasra Namam


గర్భిణీ స్త్రీ 8, 9 నెలల్లో నిత్యం లలితా సహస్రనామ పారాయణం చేయాలి. ఇదే నియమం.

ఇక 7వ నెల వరకూ శారీరక ఆరోగ్య పరిరక్షణ (తల్లికీ, బిడ్డకీ) జరిగింది. ఇక చివరి రెండు నెలలపాటూ మానసిక ఆరోగ్య పరిరక్షణ విషయంలో జాగ్రత్తపడాలి తల్లి. ఈ రెండు నెలలకాలంలో గర్భస్థ శిశువు జీవరూపంతో ఉన్నాడు కాబట్టి ప్రతి విషయాన్నీ గమనించగలుగుతాడు. ఈ కారణంగా దోపిడీలూ, హత్యలూ, తీవ్ర ఉద్వేగానికి సంబంధించిన సంఘటనలూ, రక్తపాతాలు, మనోవ్యధలూ నిండిన చిత్రాలని, పాటలని, కథలని, నవలలని గాని చవినట్లయితే చదువుతున్న ఆ తల్లిద్వారా అలాంటి సంఘటనలను చూస్తున్న అదే లక్షణాలు శిశువుకి సంక్రమించి తీరుతాయి.

తీవ్రకోపం, ఆందోళన, చిరాకు, మనోవ్యధ, తీవ్రమౌనం, చురుకుదనం లేకపోవడం...వంటి లక్షణాలన్నీ శిశువుకి సంక్రమిస్తున్నాయంటే దానికి కారణం ఈ తీరు కథాక్రమమున్న చిత్రాలే. గాంధారికి పగ, ద్వేషం, అసూయ ఉన్న నూరుగురు పిల్లలు పుట్టడానికి కారణం కుంతీ విషయంలో తనకున్న ఆ లక్షణాలే.

హిరణ్యకశిపుని భార్య లీలావతికి ప్రహ్లాదుని వంటి సౌమ్యుడూ, ఉత్తముడూ జన్మించడానికి కారణం నారదుని నారాయణ మంత్రోపదేశమే.

కాబట్టి గర్భిణీ శారీరక ఆరోగ్య పరిరక్షణతో పాటు మానసికారోగ్య పరిరక్షణనీ చేసుకుంటూ ఉండాలనీ భర్త సహకారం ఈ విషయంలో మరింత అవసరమనీ లలితా సహస్రం చెప్తోంది. ఈ పద్ధతులననుసరించిన పక్షంలో పుత్రోత్సాహమంటే ఏమిటో తెలుస్తుంది దంపతులకి.
దంపత్యోః అనుకూల్యాభివృద్ధిరస్తు!

సత్సంతాన ప్రాప్తిరస్తు!!


సోర్స్ : https://www.facebook.com/BrahmasriChagantiKoteswaraRao/photos/a.256156637767075.53293.176629199053153/757709147611819/?type=1&theater

No comments:

Post a Comment