గర్భిణీ స్త్రీ ఏడవ నెల పొడుగునా అన్నివిధాలైన అన్నాలనీ తినాలంటోంది లలితా సహస్రనామం. అంటే
- ఒక పాయసాన్నపు ముద్ద,
- ఒక పెసరపప్పు నేతి అన్నపు ముద్ద,
- ఒక బెల్లపన్నపు ముద్ద,
- ఒక త్రిమదుర ద్రవం,
- పెరుగన్నపు ముద్ద,
- పులగం,
- ఒక పులిహోర అన్నపు ముద్ద (ఒకటవ నెలనుండి ఇప్పటివరకూ ఏ ఆహార నియమాలని పాటించాలో ఆ అన్నిటికీ కొద్ది కొద్ది పరిమాణం చొప్పున తీసుకుంటూ మొత్తం కలిపి రెండు ముద్దలకి మించకుండా) తింటూ ఉండాలి. నెలంతా నైవేద్యమయ్యాక ఈ ముద్దల్ని స్వీకరించాక ఈ క్రింది నామాలని మననం చేసుకుంటూ వుండాలి.
సర్వాయుధధరా శుక్లసంస్థితా సర్వతోముఖీ
సర్వౌదన ప్రీతచిత్తా యాకిన్యంబా స్వరూపిణీ!!
సప్తమే మాసే జీవసంయుక్తో భవతి” – అని ఉపనిషత్తు చెప్తోంది. కాబట్టి ఏడవనెలలో జీవుని ప్రవేశం జరిగి 8,9 నెలలలో గిర్రున తిరగడం ప్రారంభమౌతుందన్నమాట. ఇక్కడితో ఆహార నియమాలు పూర్తయినట్లే.
7వ మాసంలో శిశువుని రక్షించే ఆ తల్లి పేరు “యాకినీదేవి”.
No comments:
Post a Comment